కొందరు తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ముందు గొడవ పడుతుంటారు. ఇలా చేయడం వల్ల చిన్నారులు డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి, పిల్లల ముందు అలా చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నిత్యం గొడవ పడడం వల్ల పిల్లలు మానసిక ప్రశాంతత కోల్పోయి, చిన్న వయసులోనే ఇంట్లో పరిస్థితుల గురించి ఆలోచించడం మొదలుపెడతారు. దీంతో పిల్లల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.