తొలి టెస్టులో భారత స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. స్పిన్నింగ్ బంతులతో ఆసీస్ బ్యాట్స్ మెన్ అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా జడేజా, అశ్విన్ ధాటికి ఆసీస్ 173 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. నాగ్‌పూర్ టెస్టులో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా మ్యాజిక్ చేశాడు. లంచ్ అయ్యాక కంగారూలు విరుచుకుపడ్డారు. తన సొంత బంతుల్లో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. హాఫ్ సెంచరీ బాటలో ఉన్న లబుషానే (49) స్టంపౌట్ అయ్యాడు. జడేజా బౌలింగ్‌లో ఆడేందుకు లాబుషేన్ ముందుకు రాగా... కేఎస్ భరత్ స్టంపౌట్ అయ్యాడు. తర్వాతి బంతికే రెన్ షాను డకౌట్ చేశాడు. అయితే ఈ సమయంలో ఆస్ట్రేలియా డీఆర్‌ఎస్‌కు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. 36 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 4 వికెట్లకు 84 పరుగులు చేసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే మరో వికెట్ పడగొట్టాడు. 109 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ ను బౌల్డ్ చేశాడు. 109 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆస్ట్రేలియాను హ్యాండ్స్ కోంబ్, అలెక్స్ కారీ ఆదుకున్నారు. 6వ వికెట్‌కు 53 పరుగులు జోడించారు. ఇదే క్రమంలో 36 పరుగులు చేసిన అలెక్స్ కారీని అశ్విన్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే పాట్ కమిన్స్‌ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. ఆస్ట్రేలియా 172 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో మళ్లీ బౌలింగ్ చేసేందుకు వచ్చిన జడేజాను టాడ్ మర్ఫీ (0) అవుట్ చేశాడు. ఫలితంగా టీ బ్రేక్ సమయానికి 173 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.