మూడు రాజధానులను ఏర్పాటుచేసే విషయంలో జగన్ ప్రభుత్వం తమను సంప్రదించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2014లో చేసిన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 కింద ఏపీకి నూతన రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది. ఈ కమిటీ నివేదికను తదుపరి చర్యలకోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని వివరించింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బుధవారం రాజ్యసభలో ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa