గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు ఎనలేనివని రేపల్లె కమ్యునిటీ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ జేవీ వెంకటేశ్వర్లు తెలిపారు. రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ అనుమైబేబీ ఆసుపత్రి వారిచే గురువారం నిర్వహించిన తల్లి, బిడ్డల ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి కుటుంబంలో తల్లి, బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోగలమన్నారు.