గుంటూరు: ఇంట్లో చోరీ పై లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పసుమర్తి కాలనీలో నివసించే నూకల మురళీకృష్ణ సోమవారం కుటుంబంతో ఊరు వెళ్లి, గురువారం వచ్చారు. అయితే, ఇంటి తాళాలు వేసి ఉన్నాయి. లోపలకు వెళ్లి, బీరువా పరిశీలించగా కొంత నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.