రైలు నుంచి గుర్తు తెలియని వ్యక్తి జా రిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇందుకు సంబంధించి తుని ప్రభుత్వ రైల్వే స్టేషన్ ఎస్ఐ షేక్ అబ్దుల్ మారూఫ్ తెలిపిన వివరాలివి. గుల్లిపాడు, తుని రైల్వే స్టేషన్ల పరిధిలోని పాయకరావుపేట పట్టణ శివారులో గురువారం ఉదయం విశాఖపట్నం నుంచి తుని వైపు వెళుతున్న రైలు నుంచి 25 సంవత్స రాల గుర్తు తెలియని వ్యక్తి జారిపడి మృతిచెందాడు. ఇతడు నీలం రంగు, నలుపు నిలువు చారలు చొక్కా, నీలం రంగు జీన్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. ఇంతకు మించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని ఎస్ఐ చెప్పారు. మృతదే హాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపరుస్తామని, బంధు వులు ఉంటే తమను సంప్రదించాల్సిందిగా సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.