రోజులో కొంతసేపైనా నేలపై కూర్చుంటే ఎన్నో లాభాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నేలపై కూర్చోవడం వల్ల వెన్నెముక సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువని పేర్కొంటున్నారు. మన తుంటి, తొడ, దిగువ వీపునకు సంబంధించిన కండరాలు బలపడతాయి. అలా కూర్చోవడం వల్ల ఆయుర్ధాయం పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైనట్లు చెబుతున్నారు. అయితే, నేలపై ఎక్కువ సేపు కూర్చుంటే సమస్య వస్తే సుఖాసనం, కింద దిండు వేసుకుని కూర్చోవాలంటున్నారు.