మహిళలపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా యూపీ ఖుషీనగర్ లోని పద్రౌనా కొత్వాలికి చెందిన హిరాన్హా గ్రామంలో మహిళలపై కొందరు రౌడీలు దాడికి పాల్పడ్డారు. రౌడీలు ఇంట్లోకి ప్రవేశించి మహిళలను చితకబాదిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. భూవివాదంలో భాగంగానే మహిళలపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.