విజయవాడ , భవానీపురం నగరంలోని 43వ డివిజన్ వైసీిపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గంగవరపు ఓబుల్‌రెడ్డి దంపతులు రూ.1.80 కోట్ల చిట్టీల సొమ్ముతో పరార్ కావడం సంచలనం సృష్టించింది. ప్రకాశం జిల్లా పెదారికట్ల నుంచి వలస 20 ఏళ్ల క్రితం వలస వచ్చిన ఓబుల్‌రెడ్డి, చాలా కాలం చిట్టీలను పారదర్శకంగానే నిర్వహించాడు. ఈయన కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డికి సన్నిహిత బంధువు. ఇతని తమ్ముడు వెంకటేశ్వరరెడ్డి సాక్షి పేపర్ ఏజెంటుగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. చిట్టీల సొమ్ముతో స్థానిక చర్చి వద్ద చెప్పుల షాపు నిర్వహించగా, నష్టం వచ్చిందని, దాన్ని వదిలేసి ఇంటింటా బియ్యం వ్యాపారం చేసేవాడని స్థానికులు తెలిపారు. బియ్యం తర్వాత వన్‌గ్రామ్ గోల్డ్ వ్యాపారం చేశాడు. అదీ కలిసి రాకపోవడంతో నష్టాల ఊబిలోకి వెళ్లి ప్లేటు ఫిరాయించినట్లు స్ధానికులు చెబుతున్నారు. ఓబుల్ రెడ్డి గత 10 రోజుల నుంచి మొఖం చాటేడు. రెండు రోజుల క్రితం భార్యా పిల్లలతో ఊరి విడిచి పారిపోయారు. బాధితుల్లో చిట్టినగర్, భవానీపురం, వన్‌టౌన్ వారు ఉన్నట్లు తెల్సింది. సచివాలయం వద్ద ఉన్న ఇంటికి పదుల సంఖ్యలో బాధితులు వచ్చి వెళుతున్నారు. ముఠా కూలీలు, పొట్ట చేతపట్టుకుని చిన్నచిన్న కూలీ పనులు చేసుకోనేవారే వీరి దగ్గరి చిట్టీలు వేశారు. చివరల్లో తీసుకుంటే ఎక్కువ మొత్తంలో తీసుకువచ్చని ఆరు నెలలుగా పాడుకోని వారితో పాటు, పాడిన మొత్తం కూడా ఆయనకే కొంత వడ్డీకి ఇచ్చిన వ్యక్తులు మోసపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్చాదు చేయాలా? రాజకీయ నాయకులను ఆశ్రయించాలా? అన్న సందిగ్ధంలో ఉన్నారు.