గ్రామీణ ప్రాంతాల్లో లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు విపరీత స్పందన వస్తోంది. అడుగడునా కార్యకర్తలు , మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. 15వ రోజు పాదయాత్రను శుక్రవారం పాలసముద్రం మండలంలోని రేణుకాపురం శిబిరం నుంచి ప్రారంభించి శ్రీరంగరాజపురంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఏర్పాటుచేసిన శిబిరం వద్ద ముగించారు. 15వ రోజు 14 కిలోమీటర్లు నడవగా, ఇప్పటివరకు మొత్తం 183.5 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఎస్సీలతో, బెల్లం రైతులతో, బెంగళూరులో స్థిరపడిన స్థానిక వ్యాపారులతో, కాపు సామాజిక వర్గీయులతో ఆయా ప్రాంతాల్లో ఆయన సమావేశమయ్యారు. వారి సమస్యలు విని టీడీపీ వచ్చాక న్యాయం చేస్తామని హామీనిచ్చారు.