ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం మండలంలోని పెదనాగులవరంలో శుక్రవారం రాత్రి ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైసీపీ సాగిస్తున్న అరాచకాలు, హత్యా రాజకీ యాలు వివరిస్తూ, కరపత్రాలు పంపిణీ చేశారు. వివిధ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాకర్ల శ్రీనివాసులు, రామాంజులరెడ్డి పాల్గొన్నారు.