మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ2గా ఉన్న వై.సునీల్ యాదవ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 16న హైకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ మంజూరు కోరుతూ ఆయన ఈనెల 6న పిటిషన్ దాఖలు చేశారు. ఇది జస్టిస్ సీహెచ్ సుమలత ధర్మాసనం ఎదుట విచారణకు రానున్నది. ఈ కేసును సుప్రీంకోర్టు ఇటీవల హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిసారి సునీల్‌యాదవ్ సహా నిందితులంతా సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. నిందితులను కడప జైలు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు హత్య కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, బెయిల్ మంజూరు చేయాలని సునీల్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 16న కాణిపాకంలో తన సోదరుడి సంస్మరణ కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతించాలని కోరారు.