యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ మాట్లాడారు. ‘‘నా పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, నేను మాట్లాడుతుంటే వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక మైకును లాక్కెళ్లారు. మైకును లాక్కోవచ్చు. కానీ నా గొంతు మాత్రం నొక్కేయలేరు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో ప్రతి రోజూ ఏదో ఒక వంకతో కేసు నమోదు చేస్తున్నారని, 400 రోజులకు కలిపి 400 కేసులు ఒకేసారి పెట్టేయవచ్చు కదా అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. యువగళం పాదయాత్ర 16వ రోజు శనివారం చిత్తూరు జిల్లాలోని శ్రీరంగరాజపురం మండలంలో కొనసాగింది. పుల్లూరు క్రాస్ వద్ద లోకేశ్ మాట్లాడుతున్న మైక్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పుల్లూరు క్రాస్ సహా పిళ్లారికుప్పం, కత్తెరపల్లె ప్రాంతాల్లో తనను చూసేందుకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి లోకేశ్ స్టూల్ ఎక్కి మైకు లేకుండానే ప్రసంగించారు.