కొత్త గవర్నర్తో రాజ్యాంగ సంరక్షణ జరుగుతుందని, అబ్దుల్ నసీర్ మంచి న్యాయ కోవిదుడని ఆయనను ఏపీ గవర్నర్గా నియమించారని రఘురామ అన్నారు. అయితే గవర్నర్ను మారుస్తారని సీఎం జగన్ ఊహిచించలేదని అన్నారు. చర్చిలకు, నిర్మాణాలకు ప్రజల సొమ్మును కేటాయిస్తున్నారని, గత గవర్నర్ ఎన్నో జీవోలకు సంతకాలు పెట్టారని.. వాటిని కోర్టు కొట్టేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో అడిగే హక్కు గవర్నర్కు ఉంటుందన్నారు.