రాజధాని తరలింపుపై ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోర్టుధిక్కార నేరం కింద పరిగణించాలని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ లేఖపై అటార్నీ జనరల్ వెంకటరమణి స్పందించారు. గత నెలలో ఢిల్లీలో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సు లో విశాఖ రాజధాని కాబోతుందంటూ సీఎం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు లో కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇటువంటి ప్రకటన న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగం కలిగించడమే అని పేర్కొన్నారు. సీఎంపై సూమోటో కంటెంట్ తీసుకోవాలని సుప్రీంకోర్టు రిజిస్టార్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు శ్రావణ్ లేఖ రాశారు. అయితే... గతంలో తాను ఏపీ ప్రభుత్వం తరపున కేసులు వాదించి ఉండటంతో దీనిపై నిర్ణయం తీసుకోలేనని పేర్కొంటూ శ్రావణ్‌కు అటార్నీ జనరల్ తిరిగి లేఖ రాశారు.