వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ఏలూరు జిల్లా, బుట్టాయగూడెం మండలం దొరమామిడి గ్రామంలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తుల వద్దకు వెళ్లి వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని వివరించారు. అలాగే 15 అంశాలపై వారి వద్ద నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని వాటిని నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని అందరూ కూడా టీడీపీకి మద్దతుగా +91 92612 92612 నంబరుకి మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరడం జరిగింది. సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కోమటి పద్మరాజు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, ఎస్టీ సెల్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు తెల్లం వెంకటేశ్వరరావు, యుకేడి బాబు, ఆండ్రూ శ్యాం కుమార్ (జహంగీర్), పఠాన్ రసూల్ ఖాన్, మద్దిపాటి శ్రీను, , గన్నిన సూర్యచంద్రరావు, బొబ్బర ఎలీషా గార్లు తదితరులు పాల్గొన్నారు.