పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళలో యూబీఐ బ్యాంకు తెరుచుకోలేదు. యూబీఐ బ్యాంకుకు తాళలు వేసిన సిబ్బంది ఇప్పటివరకు తీయడం లేదు. దాంతో యూబీఐ ఎదుట ఖాతాదారుల ఆందోళన కొనసాగుతుంది. నగదు చెల్లిస్తాం, బంగారం ఇవ్వాలని బాధితుల డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు అండగా వచ్చిన జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
కాగా సత్తెనపల్లి నియోజకవర్గం వివాదాలమయమైందని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. రైతులకు బంగారం ఇవ్వకుండా... బ్యాంక్ సిబ్బంది జాప్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. అప్రెయిజర్ సంపత్ మంత్రి అంబటి అనుచరుడన్నారు. బంగారం మాయంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. బంగారం మాయం వెనుక మంత్రి అంబటి హస్తం ఉందని గాదె ఆరోపించారు. రైతులకు అన్యాయం జరిగితే మంత్రి ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు.