మొదటిసారిగా వచ్చే నెలలో ప్రారంభం కానున్న వుమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (వుమెన్స్ ఐపీఎల్) కోసం క్రికెటర్ల వేలం సోమవారం జరిగింది. ముంబైలో జరిగిన ఈ వేలంలో నగరానికి చెందిన స్నేహ దీప్తిని ఢిల్లీ కేపిటల్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. సుమారు పదేళ్ల క్రితం భారత్ సీనియర్ వుమెన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్నేహ దీప్తి...బంగ్లాదేశ్‌పై ఒక వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్, ఒక టీ20 మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత జట్టులో స్థానం లభించలేదు. రైల్వేలో ఉద్యోగం పొందిన తర్వాత కొన్నేళ్లపాటు ఇండియన్ రైల్వే వుమెన్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం ఆంధ్ర సీనియర్ వుమెన్ క్రికెట్ జట్టుకు ఆడుతోంది. కాగా నగరానికే చెందిన యువ క్రికెటర్ షబ్నంను గుజరాత్ జెయింట్స్ రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. ఇటీవల జరిగిన మహిళల అండర్-19 వరల్డ్ కప్‌లో చాంపియన్స్‌గా నిలిచిన భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన షబ్నం...తొలి వుమెన్స్ ఐపీఎల్లో గుజరాత్ జెయింట్స్ ప్రారంభ ధర (రూ.10 లక్షలు)కు కొనుగోలు చేసింది.