మనదేశంలోని యువతలో ఎక్కువ శాతం మంది నేటికీ అజ్ఞానాంధకారంలోనే ఉంటున్నారని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ రఘునందన్ కుమార్ అన్నా రు. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామ పరిధిలోని చార్వాక ఆశ్రమంలో జరుగుతున్న నాస్తిక మేళా రెండో రోజు సదస్సులో ఆయన ప్రసంగించారు. ఖగోళ విజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే మన దేశంలోని ఉన్నత విద్యాలయాల్లో జ్యోతిష్యం, భూతవైద్యం కోర్సులు పెట్టి ప్రజలను, యువతను అజ్ఞానాంథకారంలోకి నెడుతున్నారని విమర్శించారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ యూనియన్ 13 రాశులు వున్నాయని చెప్పి నప్పటికీ ప్రస్తుతం జ్యోతిష్యశాస్త్రం 12 రాశులతోనే కాలం గడుపుతుందన్నారు. ఈ అజ్ఞానాంధకార ఊభినుంచి యువత బయటపడాలంటే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో నాస్తిక సమాజం ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.