ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో ఈ నెల 17 నుంచి 2వ టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్ కు టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది. వెన్నునొప్పితో అయ్యర్ తొలి టెస్ట్ ఆడలేదు. తాజాగా నేషనల్ క్రికెట్ అకాడమీలో జరిగిన మెడికల్ టెస్టుల్లో క్వాలిఫై అయినట్లు ప్రకటించింది. త్వరలోనే అయ్యర్ భారత జట్టులో చేరతాడని పేర్కొంది. అయ్యర్ రాకతో భారత మిడిలార్డర్ బ్యాటింగ్ మరింత బలంగా మారనుంది.