ఆలూరు మండల పరిధి లోని మంగళవారం కమ్మరచెడు గ్రామం లోని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో మాల మహా నాడు సంఘం ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య 102 వ జయంతి వేడుక లను ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి అలూరు ఎంపీపీ రంగమ్మ అధ్యక్షతన దామోదర్ సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భం గా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మహానంది, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్రి బసప్పులు మాట్లాడుతూ నిరుపేదలకు దామోదర్ సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు పంచిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి అన్నారు. అలాగే వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వాలని మొట్ట మొదటిగా గ్రహించిన పంపిణీ చేసిన మొదటి వ్యక్తి దామోద సంజీవయ్య అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానంలోనే అడుగులు వేస్తూ నిరుపేదలకు ఆ రోజు ల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిజాయితీ పరుడుగా ప్రజలలో ఉంటూ సొంత ఇల్లు కూడా లేనటువంటి ఆదర్శమైన వ్యక్తి అని వారు కొనియాడా రు. ఎంతోమంది మహానుభావు డులాగే పదవి చేపట్టి నపటి నుంచి పనిచేయాలన్న స్ఫూర్తితోనే ముందుకు నడిచారన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సేవలు అందించాల న్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు వీరేష్, బసాపురం వీరన్న, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.