ఇటీవల చైనా స్పై బెలూన్లను అమెరికా కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. బెలూన్ కూల్చివేతపై చైనాకు సారీ చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీనిపై త్వరలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మాట్లాడతానని పేర్కొన్నారు. అమెరికా ప్రజల ప్రయోజనాలు, భద్రతకే తాము ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇటీవల అమెరికా గగనతలంతో చైనా స్పై బెలూన్ రావడంతో అమెరికా కూల్చివేసింది.