కొందరిలో అధిక చెమట చికాకు కలిగిస్తుంది. కొన్ని టిప్స్ ద్వారా ఉపశమనం పొందవచ్చు. కొద్ది నీటిలో గంధం వేసి పేస్టు చేయండి. దీనిని అరచేతులు, అరికాళ్లు, చంకలు వంటి ప్రదేశాల్లో రాసుకోండి. గంధం బదులు అలోవెరా జెల్‌ను రాసినా మంచి ప్రయోజనం ఉంటుంది. అధిక కారాలు ఉండే ఆహారాలు, వేడివేడి ఆహార పదార్థాలను తినకపోవడం మంచిది. అవి తీసుకోవడం వల్ల పరిస్థితి మరింత క్షీణిస్తుంది. తెల్లని ఉల్లిపాయ, బ్రోకలి, బీఫ్, లివర్ వంటి పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి.