బాగా తలనొప్పి కలిగినప్పుడు జీడిపప్పు, పిస్తా, బాదంపప్పులు తింటే కొంత నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అవి పెయిన్ కిల్లర్స్ మాదిరిగా పని చేస్తాయి. తలనొప్పి ఉన్న సమయంలో స్వచ్ఛమైన గాలిని కొంతసేపు పీల్చుకుని ఒంటరిగా కాసేపు వాకింగ్ చేయడం మేలు. ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ అల్లం రసం కలుపుకుని తాగినా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే కాస్తా రిలీఫ్ లభిస్తుంది.