ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశాక ఖర్చు తగ్గించుకోవడం కోసం చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. తాజాగా భారత్ లో ఉన్న మూడు ట్విట్టర్ కార్యాలయాల్లో రెండింటిని మస్క్ మూసివేశారు. ఢిల్లీ, ముంబై ఆఫీసులను మూసివేసిన ట్విట్టర్, అక్కడి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించింది. కాగా, బెంగళూరులో ఉన్న కార్యాలయం యథావిధిగా పనిచేయనుందని సమాచారం.