మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తమ వాదనలను వినాలంటూ వివేకా భార్య సౌభాగ్య, కుమార్తె సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో రెండో నిందితుడు సునీల్‌యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో ఇంప్లీడ్ అవుతూ.. ఈ విజ్ఞప్తి చేశారు. వారి ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతిస్తూ.. వారి వాదనలను వింటామని కోర్టు తెలిపింది. వివేకా హత్యకేసుకు సంబంధించి ఏపీ పరిధిలో పారదర్శక దర్యాప్తు జరిగే పరిస్థితి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ కేసును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఏ2గా ఉన్న సునీల్‌యాదవ్.. తనకు ఈ హత్యతో ఏ సంబంధం లేదని.. తన పాత్రపై ఎలాంటి ఆధారాలు లేకున్నా.. 18 నెలలుగా జైలులో ఉంటున్నానని పేర్కొంటూ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం జస్టిస్ సీహెచ్ సుమలత ధర్మాసనం విచారణ చేపట్టింది. సునీల్‌యాదవ్ తరఫున న్యాయవాది నయన్‌కుమార్ వాదనలు వినిపించారు. తన క్లయింట్ అకారణంగా 18 నెలల నుంచి జైల్లో ఉన్నారని, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి తరహాలోనే అతనికీ బెయిల్ ఇవ్వాలని కోరారు.