మదమెక్కిన దున్నను ఈసారి తరిమితరిమి కొట్టాలి’ , ‘ఒక్క చాన్స్ అన్న జగన్కు అధికారం ఇచ్చి.. పాలిచ్చే ఆవును కాదనుకుని, ఎగిరి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు. అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్ర 21వ రోజు(గురువారం) తిరుపతి జిల్లా సత్యవేడులోని కేవీబీపురం మండలం రాయపేడు నుంచి అదే మండలం బైరాజుకండ్రిగ వరకు 17.2 కిలోమీటర్లు కొనసాగింది. మార్గమధ్యంలో పొలం పనులు చేసుకుంటున్న రైతు కూలీలతో లోకేశ్ సెల్ఫీలు దిగి, వారి సమస్యలను తెలుసుకున్నారు. మహిళా కార్మికులు ప్రయాణించే డిక్సన్ కంపెనీ బస్సు ఎక్కి, ఇలాంటి పరిశ్రమలు ఎన్నో టీడీపీ హ యాంలో వచ్చాయంటూ వారితో సంభాషించా రు. యువత, రైతులు, ముదిరాజ్ సామాజిక వర్గీయులతో మాట్లాడారు. 21 రోజుల్లో మొత్తం 278.5 కిలోమీటర్లు లోకేశ్ నడిచారు.