ప్రధానమంత్రి అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్‌పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో వివిధ అంశాలను పరిశీలించేందుకు ఢిల్లీ బృందం ప్రకాశం జిల్లాలో పర్యటించింది. ఈ అవార్డుకు సంబంధించి జాతీయస్థాయిలో మొదటి రౌండ్ కలెక్టర్ల జాబి తాలో కలెక్టర్ దినేష్‌కుమార్‌కు స్థానం దక్కింది. జిల్లాలో పాఠశాల, కళాశాల విద్యార్థుల కేరీర్ గైడెన్స్ తదితర అంశాలపై కలెక్టర్ ముందజంలో ఉన్నారు. ఈ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వ డి పార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్డేచర్ డైరెక్టర్ ఆర్‌కే తాతాన్‌దార్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిప్యూటీ సెక్రటరీ సీతారామమీనాల బృందం జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా ఒంగోలులోని సమగ్రశిక్ష జిల్లా ప్రా జెక్టు కార్యాలయంలో కమాండ్ కంట్రోలు రూం, చీమకుర్తి ఎస్సీ గురుకుల పాఠశాల, పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒంగోలులోని వసతిగృహాలను సందర్శించి వివరాలను సేకరించారు. శుక్రవారం కేజీబీవీలు, ఇతర స్కూళ్లను వారు పరిశీలించనున్నారు.