ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ మాటలు విని...చంద్రబాబును అపార్థం చేసుకొన్న: రాజేష్ మహాసేన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 17, 2023, 11:48 PM

జగన్‌ మాటలు విని చంద్రబాబును అపార్థం చేసుకున్నామని.. అయితే నిజమైన దళిత ద్రోహి ఎవరో తెలుసుకోగలిగామని రాజేష్ మహాసేన పేర్కొన్నారు. రాజేష్ మహాసేన టీడీపీలో చేరారు.. అధినేత చంద్రబాబు (కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో దళిత సామాజిక వర్గంతో నిర్వహించిన సమావేశంలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును తాము వ్యతిరేకించామని.. ఆయన్ను దళిత ద్రోహిగా జగన్‌ చిత్రీకరించారన్నారు. జగన్‌ మాటలు విని చంద్రబాబును అపార్థం చేసుకున్నామని.. అయితే నిజమైన దళిత ద్రోహి ఎవరో తెలుసుకోగలిగామన్నారు.


టీడీపీకి 40 ఏళ్ల చరిత్ర టీడీపీకి ఉందని.. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును విలన్‌లా చూపించారని రాజేష్ చెప్పుకొచ్చారు. దళితులకు ద్రోహం చేశారని.. బాబాయిని చంద్రబాబు చంపించారని నమ్మించారని.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయన్నారు. చంద్రబాబును అపార్థం చేసుకున్నాం.. జగన్ గెలుపు కోసం పనిచేసామని.. కానీ ఆ తర్వాత అసలు నిజాలు తెలిశాయన్నారు. దళితుడ్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తులకు సన్మానం చేసిన వ్యక్తుల్ని చూశామని.. దళితులకు జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకోగలిగామన్నారు.


దళితులు ఎవరి కాళ్లమీద వారు నిలబడేలా చంద్రబాబు చేశారన్నారు. దళితులకు 27 సంక్షేమ పథకాలను అమలు చేస్తే.. జగన్ ప్రభుత్వం రాగానే వాటిని రద్దు చేశారని విమర్శించారు. 2019లో తప్పు చేయకుండా ఉండుంటే అమరావతి నిర్మాణం పూర్తయ్యేదని.. చీకటి వచ్చాకే వెలుగు విలువ తెలుస్తుంది అన్నారు. అమరావతి భవనాలను చూసి ఇడ్లీ పాత్రలని వెటకారం చేశారని.. ఇప్పుడు వాళ్లు హైదరాబాద్ఋలో ఇడ్లీలు అమ్ముకుంటున్నారన్నారు. చంద్రబాబు పాలనలో దళితులు ఇన్నోవా కార్లకు ఓనర్లయ్యారన్నారు.


గతంలో చంద్రబాబు రాష్ట్రం కష్టాల్లో ఉంది ఓ గంట అదనంగా పనిచేయమని అడిగితే విమర్శించారు.. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు కూడా రావడం లేదన్నారు. చంద్రబాబు గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత టీడీపీలో చేరామని.. దళితులకు చంద్రబాబు అన్యాయం చేశారని అంటున్నారని.. దళితులకు చంద్రబాబు ఏం చేశారు.. జగన్ ఏం చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. చంద్రబాబుకు ఎస్సీలంటే చిన్న చూపు ఉంటే మరి బాలయోగిని లోక్‌సభ స్పీకర్ ఎలా చేశారని ప్రశ్నించారు.


చంద్రబాబు రాష్ట్రం కోసం లోకేష్‌ను పాదయాత్రకు పంపించారని.. ఈ వయసులో చంద్రబాబు ఎన్నో అవమానాలు పడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి వెళతాం, ప్రతి దళిత కుటుంబాన్ని కలుస్తామని.. చంద్రబాబును సీఎంను చేయడమే తమ లక్ష్యం అన్నారు. చంద్రబాబు 2019లో గెలిచి ఉంటే రాష్ట్రంలో ఎంతో ముందుకు వెళ్లేదని.. ఆ తప్పు మళ్లీ జరగకుండా చూస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com