నందమూరి తారకరత్న కుప్పంలోని యువగళం పాదయాత్రలో తారకరత్నకి గుండెపోటు వచ్చింది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విదేశీ వైద్యుల బృందం ఆయనకు ప్రత్యేక చికిత్స అందించింది. శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన కన్నుమూశారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తారకరత్న మరణవార్త సినీ ప్రపంచంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa