రోడ్డు వెంట నడుస్తున్న మహిళ మెడలో 5 సవర్ల గోలుసు చోరీ చేసిన ఘటన. స్థానిక ఐల్యాండ్ సెంటర్ వద్ద ఓ దుకాణం నిర్వహించే శాంత కుమారి అనే మహిళ జీబీసీ రోడ్డు వెంట నడుస్తూ వెళుతోంది. ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆమె మెడలో ఉన్న 5 సవర్ల గొలుసును లాక్కుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa