మధ్యప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు షాకిచ్చింది. రాష్ట్రంలోని అన్ని బార్లను మూసివేస్తూ నూతన మద్యం పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వైన్ షాపుల్లో పర్మిట్ రూంలకు కూడా అనుమతించబోమని తెలిపింది. మద్యం షాపుల కాంట్రాక్ట్ రెన్యువల్ ఛార్జీలను 10 శాతం మేర పెంచుతామని హోంశాఖ మంత్రి సర్వోత్తమ్ మిశ్రా తెలిపారు. బార్ లు తెరవాలని నిరసనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.