లోండా- గుంజి సెక్షన్ల మధ్య డబ్లింగ్ పనులు జరుగుతు న్నందున హరిప్రియ ఎక్స్ ప్రెస్ ను తిరుపతి- ధార్వాడ్ మధ్య మాత్రమే అయిదు రోజులపాటు నడపనున్నట్లు కడప రైల్వే స్టేషన్ మేనేజరు నరసింహా రెడ్డి, కడప చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టరు ఉమర్ భాష తెలిపారు. తిరుపతి-కోల్హాపూర్ మధ్య నడిచే హరిప్రియ ఎక్స్ ప్రెస్ రైలును ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు తిరుపతి- ధార్వాడ్ వరకు మాత్రమే నడపనున్నారన్నారు. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు ధార్వాడ్ నుంచి తిరుపతి వరకు మాత్రమే నడవనుందని తెలిపారు.