ఢిల్లీలోని LNJP ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఓ బాలింత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన శిశువు మరణించిందని చెప్పిన వైద్యులు ఆమె మృతదేహాన్ని చిన్న డబ్బాలో పెట్టి కుటుంబీకులకు ఇచ్చారు. వారు ఇంటికి వెళ్లాక ఆ డబ్బా కదలటంతో తెరచి చూడగా అందులో బేబీ బతికే ఉందని గుర్తించారు. అదే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు శిశివును చూసేందుకు కూడా నిరాకరించారు. దీంతో వారు నిరసనకు దిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa