ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారు : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2023, 09:01 PM

గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసి కారుకు నిప్పు పెట్టిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేసి వాహనాల దహనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేస్తున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమన్నారు. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారంటూ చంద్రబాబు నిరసించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి.  కారకుల పై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి అని చంద్రబాబు అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com