బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి ఆహారం అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రోజూవారీ చార్జీలను పెంచుతూ సీఎస్ జవహర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 3వ, 4వ తరగతుల విద్యార్థుల డైట్ చార్జీలు రూ.1,150కి పెంచగా.. 5 నుండి 10వ తరగతి విద్యార్థుల డైట్ చార్జీలు రూ.1,400కి పెంచారు. అలాగే ఇంటర్ ఆపై విద్యార్థులకు డైట్ చార్జీలు రూ.1,600కి పెంచారు. డైట్ చార్జీల పెంపుతో ప్రభుత్వంపై రూ.112 కోట్ల అదనపు భారం పడనుంది.