ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో మచిలీపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మొత్తంగా రూ.3,940 కోట్ల మేర రుణాన్ని మంజూరు చేసింది. ఈ మొత్తాన్నంతటినీ మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి వ్యయం చేయాల్సి ఉంటుంది.