గన్నవరంలో టిడిపి కార్యాలయంపై వైసిపి గూండాలు దాడి చేయడం పై కందుకూరు నియోజవర్గ టిడిపి ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం పత్రిక ముఖంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. టిడిపి నాయకుడు దొంతు చిన్నాను, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు బెదిరించి ఆయన ఇంటిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. పార్టీ కార్యాలయం పైనే దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ వైసిపి గుండాలకు సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. అక్రమంగా అరెస్టు చేసిన పట్టాభిరాంను తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.