వాతావరణ కాలుష్యం ఎంతటి ప్రమాదమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2050 సంవత్సరం నాటికి భయంకరమైన వాతావరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 ప్రాంతాలలో అత్యధిక భాగం చైనా కాగా, యూఎస్ మరియు భారతదేశంలో కూడా అటువంటి వాతావరణ ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రాంతాలు ఉన్నాయని తాజాగా ఒక అధ్యయనం తేల్చింది. వాతావరణ ప్రమాదంలో భారత్ లోని 9 రాష్ట్రాలు క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్ సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్ ప్రకారం భారతదేశంలో పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కేరళ మరియు అస్సాం రాష్ట్రాలు అత్యంత హానికరమైన వాతావరణ ప్రమాదాన్ని కలిగి ఉన్నాయని డేటా వెల్లడించింది. భారతదేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైలో కూడా తీవ్రమైన వాతావరణ ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఈ ర్యాంకింగ్ లో తేలింది. 50 హై రిస్క్ ఉన్న రాష్ట్రాలలో భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయని ఇది అప్రమత్తం అవ్వాల్సిన సమయం అని పేర్కొంది.