కాకినాడ పరిధిలోని గ్రామీణ మండలం రాయుడుపాలెంకు చెందిన ఆరుద్ర కుమార్తె సాయి లక్ష్మీ చంద్ర పుట్టుకతోనే వెన్నుముక సమస్యతో బాధపడుతోంది. దీంతో కుమార్తె వైద్యం కోసం అన్నవరంలోని ఇంటిని అమ్మేందుకు కొంతకాలంగా ఆరుద్ర ప్రయత్నం చేస్తోంది. కాగా... పక్కన ఉండే కానిస్టేబుల్ ఆ ఇంటిని అమ్మనివ్వకుండా అడ్డుపడుతున్నారంటూ ఆరోపించారు. రూ. 40 లక్షలు విలువ చేసే ఇంటిని రూ.10లక్షలకు తమకే అమ్మాలంటూ వేధిస్తున్నారంటూ సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వారికి పోలీసు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గతేడాది నవంబర్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ బాధను చెప్పి న్యాయం చేయాలని కోరేందుకు వెళ్లగా.. అక్కడ అధికారులు అడ్డుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై చేయి కోసుకుంది. వెంటనే అధికారులు అప్రమత్తమై ఆరుద్రను ఆస్పత్రికి తరలించారు.