టీడీపీ కార్యాలయం విధ్వంసానికి నిరసనగా ఛలో గన్నవరం కార్యక్రమానికి తెలుగుదేశం అధిష్టానం పిలుపిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కృష్ణ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్ని ఎక్కడికక్కడ గృహానిర్భంధం చేస్తున్నారు. గొల్లపూడిలో దేవినేని ఉమా, విజయవాడలో బోండా ఉమా, బుద్దా వెంకన్న తదితర నేతలను గృహానిర్భంధం చేశారు. కాగా గన్నవరంలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధిస్తూ.. పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. గన్నవరంలో దాడుల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. టీడీపీ, వైసీపీ కార్యాలయాల దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.