ఇటీవల గాల్లో ఎగిరిన విమానాలు ఎక్కడ ల్యాండ్ అవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అమెరికాలోని న్యూయార్క్ నగరం నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానం బ్రిటన్ రాజధాని లండన్‌కు మళ్లించారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానే దీన్ని లండన్‌కు దారి మళ్లించి హిత్రూలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. మెడికల్ ఎమర్జెన్సీ అవసరమైన ప్రయాణికుడిని దించిన తర్వాత విమానం లండన్ నుంచి ఢిల్లీకి బయల్దేరుతుందని అధికారులు తెలిపారు. అయితే, ఏ రకమైన మెడికల్ ఎమర్జెన్సీ అనేది మాత్రం తెలియజేయలేదు. దీంతో ఈ నాన్ స్టాప్ విమానం షెడ్యూల్ కన్నా 6 నుంచి 7 గంటలు ఆలస్యంగా ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఈ విమానంలో దాదాపు 350 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఇది ఇలావుండగా, ఒక రోజు ముందు, దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్‌లో పైలట్‌కు సమస్య రావడంతో తిరువనంతపురంలోని విమానాశ్రయం నుంచి సహాయం కోరింది. బోరున విలపించిన సాయి మాధవ్ బుర్ర 'ల్యాండింగ్ సమయంలో పైలట్ అసౌకర్యంగా భావించాడు. ఏటీసీ నుంచి సహాయం కోరాడు. ఇది షెడ్యూల్ ప్రకారం ఉదయం 6.30 గంటలకు సాధారణ ల్యాండింగ్ కావాల్సింది. అయితే, పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదని పేర్కొంది. IX540 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్‌లో తనిఖీ చేసిన తర్వాత విమానం నోస్ గేర్ చక్రంపై పొర డి-క్యాప్ అయిందని నివేదికలో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.