టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి కనబడటం లేదంటూ భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.... ‘‘పట్టాభిని ఎవరు తీసుకెళ్ళారో తెలీదు. నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అరగంట సమయంలో నా భర్త పట్టాభి ఎక్కడున్నాడో నాకు తెలియాలి. లేనిపక్షంలో డీజీపీ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తా. నా కూతురు రాత్రి నుంచి నాన్న ఇంటికి రాలేదని భయపడుతోంది’’ అని తెలిపారు. ప్రజల తరఫున మాట్లాడితే కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు. ప్రతి పోలీసు స్టేషన్లకు తమ వాళ్ళను పంపినప్పటికీ పట్టాభి ఎక్కడా లేరని.. ఆయనను ఎక్కడ దాచారని చందన ప్రశ్నించారు.