ప్రస్తుత కాలంలో మద్యం సేవించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందులోనూ బీర్ తాగేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే మద్యం, బీర్ తాగడం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టం కూడా ఉంది. బీర్ అధికంగా తాగడం వల్ల కాలేయం మీద చాలా ప్రభావం పడుతుంది. అధిక కొవ్వు, డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఆల్కహాల్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బీర్లను అధికంగా తాగడం వల్ల అందులో ఉండే గ్యాస్ కడుపులో అసిడిటీని కలిగించడం వల్ల కడుపులో మంట, జీర్ణాశయం, పేగుల్లో అలజడి మొదలై అల్సర్లకు దారి తీస్తుంది.