దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 18.82 పాయింట్లు నష్టపోయి 60,672.72 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 17.90 పాయింట్లు నష్టంతో 17,826.70 దగ్గర స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 82.79గా ఉంది. టాటా స్టీల్, రిలయన్స్, HDFC, ICICI బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, నెస్లే షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. టైటన్, SBI, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.