టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషా కొత్త సమస్యలో చిక్కుకున్నాడు. సెల్ఫీ దాడిలో వార్తల్లోకెక్కిన షాపై ఆ కేసులో నిందితురాలైన సప్నా గిల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెయిల్పై విడుదలైన సప్నా ముంబై పోలీసులను ఆశ్రయించింది. ‘ఓ హోటల్ వద్ద మద్యం మత్తులో ఉన్న షాతో సెల్ఫీ దిగేందుకు నా స్నేహితుడు ప్రయత్నించగా, అతడు దాడి చేశాడు. దీంతో నేను జోక్యం చేసుకున్నాను. నా ఫ్రెండ్ దాడి చేయొద్దని వేడుకున్నప్పటికీ వారు వినిపించుకోలేదు. పైగా నాపై కేసు పెట్టారు’ అని పేర్కొన్నారు.