ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లు రద్దుచేయబడ్డాయి. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ అలర్ట్ జారీ చేసింది. ట్రాఫిక్ బ్లాక్, వీరూర్-మకుడి మధ్య మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు, మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే పలు రైళ్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మేరకు ట్విట్టర్‌లో వివరాలను పేర్కొంది. రద్దైన, దారి మళ్లించిన ట్రైన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్, కాజీపేట్, సికింద్రాబాద్, విజయవాడ, డొర్నకల్, కాగజ్ నగర్ మధ్య తిరిగే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. వరంగల్-కాజిపేట(ట్రైన్ నెంబర్ 07757), హైదరాబాద్-కాజీపేట్(07758), హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్(17011), సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్(17012), విజయవాడ-డొర్నకల్(07756), డొర్నకల్-విజయవాడ(07755), డొర్నకల్-కాజీపేట(07754), కాజీపేట-డొర్నకల్(07753) మధ్య రైళ్లను 21 నుంచి 23వ తేదీ వరకు రద్దు చేశారు.
ఇక సికింద్రాబాద్-వరంగల్(07462), వరంగల్-హైదరాబాద్(07463), విజయవాడ-భద్రాచలం రోడ్(07979), భద్రాచలం రోడ్-విజయవాడ(07278) ట్రైన్లను ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక నిజామాబాద్-పూణె(11410) ట్రైన్‌ను ఈ నెల 21 నుంచి 24 వరకు నిజామాబాద్-నాందేడ్ మధ్య, డౌండ్-నిజామాబాద్(11409) ట్రైన్‌ను 21 నుంచి 24 వరకు నాందేడ్-నిజామాబాద్ మధ్య, పండర్పూర్-నిజామాబాద్(01414) రైలును 21 నుంచి 25 వరకు నాందేడ్-నిజామాబాద్, నిజామాబాద్-పండర్పూర్(01413) ట్రైన్ 21 నుంచి 25 వరకు నిజామాబాద్-నాందేడ్ మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక ఆదిలాబాద్-పార్లి(07775) ట్రైన్‌ను 21 నుంచి 25 వరకు ఆదిలాబాద్-పూర్ణ మధ్య, భద్రాచలం రోడ్-బలహర్షా(17034) ట్రైన్‌ను 21 నుంచి 24 వరకు వరంగల్-బలహర్షా మధ్య, సిర్పూర్ టౌన్-భద్రాచలం(17034) రైలును 21 నుంచి 24 వరకు సిర్పూర్ టౌన్-వరంగల్ మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే స్పష్టం చేసింది.