సుదీర్ఘకాలంగా రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన బిశ్వ భూషణ్ హరిచందన్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా బుధవారం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొని గవర్నర్ హరిచందన్ రాష్ట్రానికి అందించిన సేవలు మరువలేమని వారికి వివరించి వారికి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతాభినందనలు మరియు వారి ఆయురారోగ్యాలు బాగుండాలి అని తెలియజేశారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.