ఇరువురు భామల కౌగిలి అంటే.. ఇరుకునపడి నలగటమే అని కవులు చెబుతారు కానీ, అమెరికాకు చెందిన నిక్ డెవిస్ ఏకంగా ముగ్గురు రమణులతో దర్జాగా నెట్టుకొస్తున్నాడు.అతడి ముగ్గురు భార్యలూ ఉద్యోగాలు చేస్తూ నిక్‌ను పోషిస్తున్నారు మరి. తనను తాను చెస్ ఆటలో రాజుతో పోల్చుకునే నిక్ ''రాజు ఎక్కడైనా కష్టపడతాడా?'' అని ప్రశ్నిస్తాడు. తన ముగ్గురు రాణులను ఉద్యోగాలకు పంపి హాయిగా ఇంట్లో ఉంటున్నాడు. పదిహేనేళ్ల క్రితం మొదటి భార్య ఏప్రిల్ (38) అతడి జీవితంలోకి వచ్చింది.
తొమ్మిదేళ్ల కిందట.. భార్య సమ్మతితోనే జెన్నీఫర్ (34)ను పెళ్లి చేసుకున్నాడు. ముచ్చటగా మూడోసారి.. ఇద్దరు భార్యల సమక్షంలో డానియేల్ (22)ను మనువాడాడు.ఈ ముగ్గురూ ఒకే ఇంట్లో కలుపుగోలుగా కాపురాలు చేసుకోవడం విశేషం. ''నా కల నిజమైంది. ఇది నా అదృష్టం'' అని మురిసిపోతాడు నిక్. ఇతడికి ఇప్పటికే ఓ కుమారుడు ఉండగా..గతేడాది జూన్‌లో మరో చిన్నారి జన్మించింది. ముగ్గురు భార్యలతో కలిసి ఉండటం అంటే నిక్కు చాలా ఇష్టమని జెన్నీఫర్ చెబుతోంది. వీరి కుటుంబ చిత్రాలు చూసి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒకే ఇంట్లో ఇలా ఉండటం చూసి విస్తుపోతున్నారు.