నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరెడ్డి బుధవారం అన్నారు. దొనకొండలోని పలు వీధులను ఆయన తిరిగి పరిశీలించారు. వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని పంచాయతీ వారు ఏర్పాటు చేసిన చెత్తకుండీలను వినియోగించాలని స్థాని కులకు సూచించారు. ప్రతి ఏడాది ఇంటి పన్నులు చెల్లిస్తే వాటితో అభివృద్ధి పనులు చేయగలమని తెలిపారు. ఆయన వెంట ఈవో ఆర్డీ డేవిడ్, కార్యదర్శి కృష్ణమూర్తి, సర్పంచి గ్రేస్ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.